ముందున్నది ప్రగతి జాతర

తాండూరు రాజకీయం వికారాబాద్

ముందున్నది ప్రగతి జాతర
– మూడు నెలల్లో అభివృద్ధి దూకుడు
– కమలం, కాంగ్రెస్ పార్టీలను నమ్మొద్దు
– మళ్లీ బీఆర్ఎస్, పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పండగలా పట్టణ ఆత్మీయ సమ్మేళనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న మూడు నెలల్లో ప్రగతి జాతర జరగబోతుందని, 40 ఏండ్లలో జరిగని అభివృద్ది రూపు రేఖలు మారబోతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో బీఆర్ఎస్ పట్టణ స్థాయి ఆత్మీయ సమ్మేళనం పండగలా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బందు, రైతుబందు, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.

వచ్చే మూన్నెళ్లు అభివృద్ధి జాతర

వచ్చే మూడు నెలల్లో తాండూరులో అభివృద్ధి జాతర జరుగబోతోందన్నారు. పెండింగ్ లో ఉన్న మిషన్ భగీరథ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుందన్నారు. తాండూరులో బైపాస్ రోడ్డు పనులు, రింగు రోడ్డు పనులు, జాతీయ రహదారి పనులు వేగవంతం చేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు పారిశ్రామిక వాడ, ఆటో నగర్, లారీ ఫార్కెంగ్ పనులు కూడా వేగవంతం చేయడం జరుగుతుందన్నారు. పాత తాండూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించే రైల్వే అండర్ బ్రిడ్జి వంతెన పనులుకు త్వరలోనే కార్యరూపం దాల్చబోతుందన్నారు.

మైనార్టీల ఈద్గాలు, స్మశాన వాటికల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని నీళపల్లి ఏకాంబరి దేవాలయం, పెద్దేముల్ అంబు రామేశ్వర దేవాలయం, యాలాల జుంటుపల్లి రామస్వామి దేవాలయానికి నిధులు తీసుకరావడం జరిగిందన్నారు.

విద్యారంగానికి ప్రాధాన్యం

తాండూరు ప్రాంతంలో విద్యారంగానికి ప్రాధాన్యమివ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ సహాకారంతో తాండూరుకు సర్ఫింగ్ కాలేజీ, ఐటిఐ కాలేజీలను సాధించుకున్నామన్నారు. రూ. 25 కోట్లతో సాధించుకున్న నర్సింగ్ కాలేజీ త్వరలోనే ప్రారంభించేలా చూస్తామన్నారు. అంతేకాకుండా ఐటీఐ కాలేజీలో ఈ సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించబోతున్నానన్నారు.

అభివృద్ధిలో వెనక్కి తగ్గేది లేదు

గత 40 ఏండ్లుగా జరగని అభివృద్ధి గత యేడాది కాలంగా జరుగుతోందన్నారు. గత పాలకుల వల్ల ఎంతో మోసపోయామన్నారు. తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ప్రగతి పథంలో దూసుకెళుతుందన్నారు. తాండూరు లోకల్ వాసిగా ఎన్నడూ ఎవ్వరు చేయని అభివృద్ధి చేసి చూపిన ఘనత తమకే దక్కిందన్నారు. రానున్న. ఆరోజుల్లో కూడా అభివృద్ధి విషయంలో అదిరిలేదు.. వెదిలేది లేదు.. తగ్గేది లేదని ఉద్ఘాటించారు.

కమలం, కాంగ్రెస్ ను నమ్మొద్దు.

బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కమలం, కాంగ్రెస్ పార్టీలు ప్రజల వద్దకు వచ్చే యోచన చేస్తున్నాయని అన్నారు. అభివృద్ధి విషయంలో వెనుకబాటుకు గురి చేసిన కాంగ్రెస్ ను నమ్మొద్దన్నారు. మతం పేరుతో చిచ్చుపెట్టే బీజేపీని తరమికొట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందన్నారు. రూ. 100 కోట్లు ఇస్తామని మభ్యపెట్టేందుకు యత్నించిన వారిని జైలు పాలు చేయడం జరిగిందని గుర్తుచేశారు. గతంలో మంత్రిగా పనిచేసిన నాయకుడు కూడ తాండూరు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఆయన కూడ కల్ల బొల్లి మాటలు చెప్పేందుకు ప్రజల వద్దకు వస్తాయని, ఇలా ప్రజలకు వచ్చే పార్టీలను, నాయకులను నిలదీసే తత్వాన్ని పెంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ తో పాటు తాండూరు లోకల్ బిడ్డగా ఎమ్మెల్యేగా మరోసారి అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యేకు తులాభారం, ఘన స్వాగతం

తాండూరు, పట్టణ స్థాయి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. తులసి గార్డెన్ లో నిర్వహించిన సమ్మేళనానికి హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నేతలు, ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తులాభారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ వైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఆప్పూ(నయూం), కౌన్సిలర్లు విజయాదేవి, సంగీత ఠాకూర్, సిందూజ గౌడ్, వరాల శ్రీనివాస్ రెడ్డి, ఆసిఫ్, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శులు ఎం. శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్, నరేందర్ గౌడ్, న్యాయవాది కె.గోపాల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరటి హన్మంతు, యువనాయకులు జిలాని, ఇంతియాజ్, రమేష్ టైలర్, డేవిడ్, అనిల్ బాండ్ తో పాటు పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.