ఐస్ యాపిల్ వేరీ నైస్..!
– తాటి ముంజలతో లాభాలెన్నో
– ఎలా తినాలో తెలిస్తేనే బెనిఫిట్
దర్శిని డెస్క్ : వేసవిలో భగ భగ మండే ఎండలు ముంచుకొచ్చినా మన శరీరాన్ని కాపాడే పండ్లు, ఆహార పదార్ధాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఐస్ యాపిల్ ఒకటి. తాటి ముంజలు అంటే తెలియని వారు ఉండరు. పక్కా సమ్మర్‌లో లభించే తాటిముంజలను ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. తాటికాయ పైకి నల్లగా బంతి ఆకారంలో ఉన్నా.. లోపల చాల సున్నితంగా మధురంగా జెల్లీ చాక్లెట్ లాగా తియ్యగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి తో పాటు ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటివి పుష్కలంగా ఉంటాయి.
వీటిని తొక్క తీయకుండా అలాగే తినాలి. అప్పుడు సంపూర్ణ పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ విషయం చాలా మందికి తెలియక తోలు తీస్తూ ఉంటారు. ఈ పండు తినడం వల్ల శరీరానికి డీ హైడ్రేషన్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ పండులో క్యాలరీలు తక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజలని తినడం చాలా అవసరం.
ఇందులోని నీటిలో చాలా క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ నీటి పండు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. శరీరంలోని లివర్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. వీటిని గర్భిణీ స్త్రీలు తినడం వల్ల మంచి పోషణతోపాటు బిడ్డ ఎదుగుదలకు తోర్పడుతుంది. అందమైన ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. తాటి ముంజల గుజ్జును ముఖానికి రాసుకుని పావుగంట తరువాత చల్లిని నీటితో కడిగేస్తే మొటిమలు, ఎండకు ముఖం కమిలిపోవడం, నల్లగా మారడం లాంటివి తొలగిస్తాయి.
ఇదికూడ చదవండి…

