బీసీ సంఘం అభ్యున్న‌తికి కృషి చేయండి

తాండూరు వికారాబాద్

బీసీ సంఘం అభ్యున్న‌తికి కృషి చేయండి
– బీసీ యువ‌జ‌న సంఘం ఉపాధ్య‌క్షులుగా రాధాకృష్ణ‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బీసీ సంఘం అభివృద్ధికి కృషి చేయాల‌ని ఆ సంఘం జాతీయ అధ్య‌క్షులు ఆర్.కృష్ణ‌య్య అన్నారు. బుధ‌వారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ బీసీ సంఘం క‌న్విన‌ర్ రాజ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు హైద‌రాబాద్‌లోని బీసీ భ‌వన్‌లో ఆర్.కృష్ణ‌య్య‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బీసీ యువ‌జ‌న‌ సంఘం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ ఉపాధ్య‌క్షులుగా రాధాకృష్ణ‌ను నియ‌మించి ఆర్.కృష్ణ‌య్య చేతుల మీదుగా నియామ‌క ప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం జాతీయ అధ్య‌క్షులు అర్.కృష్ణ‌య్య మాట్లాడుతూ గ్రామాల్లో.. ప‌ట్ట‌ణాల్లో బీసీ సంఘం అభివృద్ధికి అంద‌రు కృషి చేయాల‌న్నారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ సంఘం ఉపాధ్య‌క్షులుగా నియామ‌క‌మైన రాధాకృష్ణ గ‌త కొన్నేళ్ల నుంచి సంఘం అభ్యున్న‌తికి పాటుప‌డుతున్నార‌ని, ఆయ‌న‌కు ఆర్.కృష్ణ‌య్య చేతుల మీదుగా నియామ‌క‌ప‌త్రం అంద‌జేయ‌డం సంతోషంగా ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జాతీయ బీసీ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర బీసీ నాయకులు ఉదయ్ కుమార్, తాండూర్ నియోజకవర్గ నాయ‌కులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.