తాండూరు రోడ్లకు రాజయోగం రావాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు రోడ్లకు రాజయోగం రావాలి
– జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయించండి
– అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు రోడ్లకు రాజయోగం కల్పించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు రోడ్ల సమస్యలపై మాట్లాడారు.

తాండూరులో గతంలో కాంగ్రస్ అధికారంలో ఉన్న సమయంలో మంజూరైన బైపాస్ రోడ్డు ఇంకా పూర్తి కాలేదని దృష్టికి తెచ్చారు. ఏండ్లుగా పనులు నత్తనడక సాగుతున్నాయని వివరించారు. మహబూబ్ నగర్ నుంచి తాండూరు మీదుగా చించొల్లి వరకు చేపడుతున్న రోడ్డు పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉందన్నారు. వీటితో పాటు వికారాబాద్ నుంచి తాండూరు, తాండూరు నుంచి జహీరాబాద్ మీదుగా నిర్మిస్తున్న మరో జాతీయ రోడ్డు పనులను కూడా వేగవంతం చేయించేలా చూడాలని కోరారు.

తాండూరు రోడ్లతో పాటు జాతీయ రహదారులకు రాజయోగం కల్పించేలా చూడాలని కోరారు. ఈ సమస్యలపై ఆర్అండ్‌బి రోడ్ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

వికాసం.. వన్‌పర్సన్‌కే…!