బాబోయ్…బావిలోకి దూసుకెళ్లిన కారు..!
– ప్రాణాలతో బయటపడిన యువకుడు
– బషీరాబాద్ మండలంలో ఘటన
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రమాద వశాత్తు ఓ కారు పాడుబడిన బావిలోకి దూసుకెళ్లింది. ఈఘటనలో కారులో ఉన్న యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన బషీరాబాద్ మండలం మంతటి గ్రామ సమీపంలో మంగళవారం అర్ధ రాత్రి చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దేముల్ మండలం కందనెల్లికి చెందిన యువకుడు నరసింహారెడ్డి మంగళవారం రాత్రి మంతటిలో సన్నిహితుల వద్ద శుభకార్యానికి వెళ్ళాడు.
శుభకార్యం ముగించుకొని స్వగ్రామానికి వస్తుండగా మంతటి శివారు మలుపు వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ బావిలోకి కారు పడిపోయింది. కారు బెలూన్స్ తెచ్చుకోవడంతో యువకుడు ప్రాణాల నుంచి బయటపడ్డాడు. తెల్లవారిన తరువాత బావిలో పడిన కారును బయటకు తీశారు.
ఇదికూడా చదవండి…

