తెలంగాణలో 13 కొత్త మండలాలు
– జీఓ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ప్రభుత్వం కొత్తగా 13 మండలాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం జీవో 251ను జారీ చేసింది.కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపారు. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కొత్త మండలాలు ఇవే..
1. గట్టుప్పల్(నల్లగొండ), 2. కౌకుంట(మహబూబ్నగర్), 3. ఆలూర్(నిజామాబాద్). 4. సాలూర(నిజామాబాద్), 5. డొంకేశ్వర్(నిజామాబాద్), 6. సీరోల్(మహబూబాబాద్), 7. నిజాంపేట్(సంగారెడ్డి), 8. డోంగ్లీ(కామారెడ్డి), 9. ఎండపల్లి(జగిత్యాల), 10. భీమారం(జగిత్యాల), 11. గుండుమల్(నారాయణపేట్), 12. కొత్తపల్లె(నారాయణపేట్), 13. దుడ్యాల్(వికారాబాద్).



