టెన్షన్‌ తగ్గించే కొత్తమీర టీ..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ హైదరాబాద్

టెన్షన్‌ తగ్గించే కొత్తమీర టీ..!
– అద్బుతమైన ప్రయోజనాలున్న పానీయం
– ఆరోగ్య సమస్యలు తగ్గడం ఖాయం
దర్శిని డెస్క్ : కొత్తమీర టీ ఏంటీ..? ఈ పదం మీరు కొత్తగా వింటున్నారా..! అయితే దీని గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ప్రస్తుత కాలంలో టీ తాగనివారు ఎవరు ఉండరు. సాధారణంగా పాలతో చేసిన టీ, కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు. కానీ, కొందరు గ్రీన్ టీ, లెమన్ టీ లేదా బ్లాక్ టీ తాగుతుంటారు. అయితే, ఇక్కడ మనం మంచి రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే ఒక స్పెషల్ గ్రీన్‌ టీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కొత్తిమీర ఆకులతో తయారు చేసిన ప్రత్యేకమైన టీ. కొత్తిమీరలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉన్నాయి. డైటరీ ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ కూడా ఉన్నాయి. కొత్తిమీరతో చేసిన టీ ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.కొత్తిమీర ఆకుల టీని రోజూ తాగితే కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో కొత్తిమీర టీ కూడా బాగా సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. దీని కోసం మీరు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఫలితం ఉంటుంది. కొత్తిమీర ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పార్కిన్సన్స్, అల్జీమర్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో సహా అనేక మెదడు వ్యాధుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. దీని ఆకులను ఉడకబెట్టి టీ తయారు చేసి తాగడం వల్ల మెదడుకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

దీంతో మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర ఆకులు నోటి దుర్వాసనను పోగొట్టడంలో సహాయపడతాయి. ఈ ఆకులతో చేసిన టీ నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా దంతాలు, చిగుళ్లను బలపరుస్తుంది. కొత్తిమీర ఆకుల టీ తాగడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మంలోని టాక్సిన్స్ ను తొలగించి శుభ్రపరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. కొత్తిమీర ఆకుల టీ తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం రక్తనాళాల టెన్షన్‌ని తగ్గించడం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. కొత్తిమీర ఆకుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇదికూడా చదవండి…

కారులోనే చెరుకు బండి..!