ఓటెత్తిన మైనార్టీ నేతలు..!
– పార్లమెంట్లో ఓటు వినియోగం
– ఓటు వేసిన జీఎంకే బిల్డర్స్ ముజీబ్ ఖాన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మైనార్టీ నేతలు ఓటెత్తారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి అన్ని వర్గాల ప్రజలతో పాటు ముస్లిం మహిళలు, మైనార్టీ నేతలు కూడా ఓటేసేందుకు బారులు తీశారు. పట్టణంలోని సాయిపూర్‌లో కాంగ్రెస్ మైనార్టీ నేత, జీఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. వజ్రాయుధంలాంటి ఓటుతో సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సర్దార్ ఖాన్, స్థానిక నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

