
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..!
– నైరుతి రుతువనాలు వచ్చేస్తున్నాయి
– తెలంగాణలోకి ఎప్పుడు వస్తున్నాయంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మొదటి, రెండో వారంలోనే నైరుతి రుతుపవనాలు వస్తన్నాయని ప్రకటించింది. ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. 2, 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన నైరుతీ రుతుపవనాలు చాలా చురుగ్గా ముందుకు విస్తరిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఏపీలో ఋతుపవనాలు విస్తరించే ఛాన్స్ బలంగా ఉందని చెప్పారు వాతావరణశాఖ అధికారులు. అన్ని అనుకూలిస్తే .. జూన్ ఫస్ట్ వీక్‌లోనే రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

జూన్ 10లోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు, జూన్ 10 లోగా తెలంగాణకు రుతుపవనాలు చేరుకుంటాయని వాతావరణశాఖ అధికారి తెలిపారు. జూన్ 11 వరకు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

