హార్ట్ స్ట్రోక్‌లపై రామబాణం..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

chai jr
హార్ట్ స్ట్రోక్‌లపై రామబాణం..!
– శరీరంలో ఇన్సులిన్‌ స్థాయి పెంపు
– అర్జున బెరడులో ఆరోగ్య ప్రయోజనాలు
దర్శిని డెస్క్‌: అర్జున బెరడు.. అడవుల్లో లభించే చెట్టు మనషుల అనారోగ్యాలపై రామబాణంలా పనిచేస్తోందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటారు. ఈ మద్య కాలంలో అధికమవుతున్న హాట్ స్ట్రోక్, హాట్‌ అటాక్‌తో పాటు గుండె సంబంధిత వ్యాధులపై దివ్యౌషధంగా పనిచేస్తుందని అంటుంటారు. అందుకే దీనిని ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. అడవుల్లో లభించే ఈ చెట్టులోని ఔషధ గుణాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఇది అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. అర్జున బెరడులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని అనేక రకాల సమస్యలను దూరం చేస్తుందని తెలిపారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతోపాటు SDL స్థాయిని పెంచుతుంది.

గుండె పదిలం
అర్జున బెరడు వాడకం గుండె సంబంధిత వ్యాధులకు దివ్యౌషధం వంటిది. హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి అనేక గుండె సంబంధిత వ్యాధులలో అర్జున బెరడు ఉపయోగం, దాని ప్రయోజనాలపై ఇప్పటివరకు చాలా అధ్యయనాలు జరిగాయి. ఆయుర్వేదంలో కషాయాల రూపంలో వాడే ప్రస్తావన ఉంది. హార్ట్ బ్లాక్ బాధితుల్లో సమస్యను తొలగించడంలో ఈ బెరడు కషాయం దోహదపడుతుంది. ఇది గుండె బ్లాక్ లను తొలగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇన్సులిన్‌ స్థాయి పెంపు
అర్జున మొక్క ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. అందుకే దీనిని ఋగ్వేదంలో కూడా ప్రస్తావించారు. అర్జున బెరడు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. అంతేకాదు షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా అద్భుతమైన మూలికగా చెప్పవచ్చు.

అర్జున బెరడు ప్రయోజనాలను ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా వర్ణించారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. ఇది చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో వ్యాధుల నుండి రక్షిస్తుంది.

మరిన్ని ప్రయోజనాలు
అర్జున బెరడు చిన్న ముక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం దానిని మరిగించి, వడపోసి త్రాగాలి. ఈ కషాయాన్ని రోజూ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అర్జున బెరడు గొంతు ఇన్‌ఫెక్షన్‌ను పోగొట్టడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దగ్గు, ఇన్‌ఫెక్షన్, గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అర్జున ట్యాబ్లెట్లు, పౌడర్ కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

ఇదికూడా చదవండి….

కట్టమైసమ్మకు కిలో వెండి కీరీటం