ప‌క‌డ్బందీగా ప్ర‌త్య‌క్ష బోధ‌న

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ప‌క‌డ్బందీగా ప్ర‌త్య‌క్ష బోధ‌న
– ప్ర‌భుత్వ బ‌డుల్లోనే 30 ల‌క్ష‌ల మందికి విద్య
– ప్రైవేటు నుంచి ప్ర‌భుత్వ బ‌డుల్లో 1.20 ల‌క్ష‌ల మంది చేరిక
– పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించిన విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి
– విద్యార్థినిల‌తో క‌లిసి మ‌ధ్యాహ్న భోజ‌నం చేసిన మంత్రి
ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో పునఃప్రారంభ‌మైన పాఠ‌శాల‌ల్లో ప్ర‌త్య‌క్ష బోధ‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితాఇంద్రారెడ్డి అన్నారు. మొదటి రోజు బుధ‌వారం రాష్ట్రంలో ప్ర‌త్య‌క్ష బోధ‌న త‌రగ‌తుల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితారెడ్డి పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి ప‌రిశీలించారు. హైద రాబాద్ విజయనగర్ కాలనీలోని ఉన్నత పాఠశాలను సంద‌ర్శించి తాగునీరు, పారిశుద్ధ్యం, మౌళిక వ‌సతుల‌ను త‌నిఖీ చేశారు. ఈ పాఠ‌శాల‌లో 40 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారని గుర్తించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితారెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శానిటైజేషన్ పనులు సమర్ధ వంతంగా చేపట్టారని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయా పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌ను అభినందించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్ర‌భుత్వ బ‌డుల‌లోనే 30 లక్షల మంది చదువుతున్నారని పేర్కొన్నారు. త‌ల్లిదండ్రులు పిల్లలను ధైర్యంగా పంపిస్తామన్నారని చెప్పారు. దీంతో పాటు పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌పై డీఈవోలు, ప్రధానో పాధ్యాయులు ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలని ఆదేశించారు. పేరెంట్స్ నమ్మకాన్ని నిల‌ బెట్టేలా అధికారులందరూ వ్యవహరించాలని సూచించారు. రెసిడెనియల్ తప్ప మిగతా పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఏడాది లక్షా ఇరవై వేల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాల‌లకు వచ్చారని వెల్ల‌డించారు. ఇంటర్లో లక్ష మంది వరకు విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలో చేరారని చెప్పారు. ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2.5 లక్షలకు పైగా విద్యార్థులు చేర‌డం జ‌రిగింద‌ని తెలిపారు. మ‌రోవైపు మహేశ్వరం బాలికల పాఠశాల లో విద్యార్థినులతో కలిసి మంత్రి స‌బితారెడ్డి మధ్యాహ్న భోజనం చేస్తున్న చేశారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి గారు, జిల్లా విద్యాధికారి సుశీంద్ర రావు గారు, ఎంపీపీ రఘుమా రెడ్డి గారు, వైస్ ఎంపీపీ సునీత అంధ్య నాయక్ త‌దిత‌రులు ఉన్నారు.