పట్టణాభివృద్ధికి సహకరించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrపట్టణాభివృద్ధికి సహకరించండి
– జిల్లా కలెక్టర్‌ను కోరిన మున్సిపల్ చైర్ పర్సన్
– శుభకాంక్షలు చెప్పిన స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధికి సహకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కోరారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ తో మాట్లాడుతూ తాండూరు పట్టణ అభివృద్ధికి సహాకారం అందించాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.

ఇదికూడ చదవండి…

స్వయం ఉపాధిలో దూసుకపోవాలి