నిరుద్యోగులపై దాడులు హేయం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

నిరుద్యోగులపై దాడులు హేయం
– రేవంత్ సర్కారు చర్యలు సిగ్గుచేటు
– చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల కోసం నిరసనలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చేపట్టిన సెక్రటరియేట్ ముట్టడికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.

నిరుద్యోగులు దర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి సర్కారు వారిపై దాడులు చేస్తుందన్నారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ వేస్తామని కాంగ్రెస్ హామి ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు హామి ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 34 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు రూ. 4వేల భృతి అందిస్తామని చెప్పిందన్నారు. గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలను పెంచుతామన్నారని అన్నారు.

యేడాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిందన్నారు. ప్రతి నెల ఉద్యోగాలను ప్రకటిస్తామని అబద్దపు హామీలు ఇచ్చిందన్నారు. అశోక్ నగర్ లో నిరుద్యోగులు చేపట్టిన నిరసనలో రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిలు ఇచ్చిన మద్దతు ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామిలను నెరవేర్చకపోవడంతో ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులపై రేవంత్ సర్కారు దాడులు, నిర్బంధాలతో హేయమైన చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిరుద్యోగుల పక్షానా పోరాటం చేస్తామన్నారు.

ఇదికూడా చదవండి…

కన్నీళ్ల కాన్పు..!