ఘ‌నంగా ఈద్ మిలాద్ ఉన్ న‌బీ

తాండూరు వికారాబాద్

ఘ‌నంగా ఈద్ మిలాద్ ఉన్ న‌బీ
– ప్ర‌ధాన వీధుల్లో ముస్లిం శాంతి ర్యాలి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలో ఈద్ మిలాద్ ఉన్ న‌బీ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగ‌ళ‌వారం మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తాండూరు అహ్లే సున్న‌తి జ‌మాత్ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌లు నిర్వ‌హించారు. తాండూరులోని ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి ప‌ట్ట‌ణంలో శాంతి ర్యాలీ నిర్వ‌హించారు. పాత తాండూరుతో పాటు ప‌ట్ట‌ణంలోని పుర‌వీదుల్లో ర్యాలీ కొన‌సాగ‌గా భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొని కీర్త‌న‌లు ఆలాపిస్తూ ముందుకు సాగారు. అదేవిధంగా తాండూరు ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ఈద్ మిలాబ్ ఉల్ న‌బీ వేడుక‌ల‌లో తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి, ఎస్ఐ గిరి, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొని మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వక్త కోసం ప్రార్థ‌న‌లు చేశారు. అనంత‌రం ముస్లిం సోద‌రుల‌కు వారిని ఘ‌నంగా స‌న్మానించారు.