టెన్త్‌లో తెలుగు తప్పనిసరి

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

టెన్త్‌లో తెలుగు తప్పనిసరి
– వచ్చే యేడాది నుంచి అమలు
– కసరత్తు చేస్తోన్న విద్యాశాఖ
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో టెన్త్‌ విద్యార్థులకు తెలుగు పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని తెలుగు అమలు కమిటి నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం 2024-25లో టెన్త్‌లో తెలుగును బోర్డు పరీక్షగా రాయడం తప్పనిసరని రాష్ట్ర తెలుగు అమలు కమిటీ స్పష్టం చేసింది. తెలుగు సబ్జెక్టు పరీక్ష రాయడంపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో తెలుగు అమలు కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, అధికార భాషా సంఘం ఛైర్మన్‌ మంత్రి శ్రీదేవి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులందరూ పరీక్ష రాసే విధంగా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!