చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాలు

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాలు
– భర్తికి నోటిఫికేషన్ జారీ చేసిన సర్కారు
– ఉద్యోగాలు, అర్హులు ఎవరంటే..?
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాలను భర్తి చేసేందుకు రేవంత్‌ సర్కారు దృష్టి సారించింది. ఉద్యోగాల భర్తీ కోసం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఆ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ప్రకటించారు. మొత్తం 30 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా ఇందులో 8 క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌, 22 టెక్స్‌టైల్‌ డిజైనర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమో చేసిన వారు అర్హులని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిన మూడేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుందని శైలజారామయ్యర్‌ స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి…

స్కూల్‌ టైమింగ్‌లో చేంజ్..!