స్కూల్ టైమింగ్‌లో చేంజ్..!
– మార్పులు చేసిన విద్యాశాఖ
– ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో టైమింగ్‌లను చేసింది. గతంలో ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సాయంత్రం 4.45కి బదులుగా 4.15 గంటలకు పని వేళలు ముగుస్తాయని తెలిపింది. ఉత్తర్వులకు అనుగుణంగా సమయ పాటించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులోఉ న్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4గంటల వరకు కొనసాగనున్నాయి.
ఇదికూడా చదవండి…

