పనిచేసిన వారికే నామినేట్ పదవులు ఇవ్వాలి
– ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డితో కలాల్ చంద్రశేఖర్ గౌడ్
– బీఎస్ఆర్‌ను కలిసి సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికే పదువులు నామినేటేడ్ కట్టబెట్టేలా చూడాలని ఆ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని పార్టీ సీనియర్ నాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ కోరారు. ఆదివారం శ్రీనివాస్ రెడ్డిని కలాల్ చంద్రశేఖర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ అధికారంలోకి వచ్చేంత వరకు పనిచేసిన నాయకులను గుర్తించాలని కోరారు.
పార్టీ కోసం పనిచేసిన వాళ్లను గుర్తించి నామినేటేడ్ పదవుల్లో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరిన వారిని పదవుల ఎంపికలో దూరం పెట్టాలని అన్నారు. ఇందుకు శ్రీనివాస్ రెడ్డి సానూకూలంగా స్పందించారు. అదేవిధంగా పదవుల విషయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కూడా కలిసి విన్నవిస్తామని కలాల్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.
ఇదికూడా చదవండి…

