విజ్ఞానాలయాల్లో మెరుగైన సేవలు
– మంత్రి కేటీఆర్ తో కొత్త భవనాలు ప్రారంభం
– త్వరలోనే సర్కారు బడుల్లో రీడింగ్ సెంటర్లు
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో తాండూరు ప్రగతి
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విజ్ఞానాలయాలకు మారు పేరుగా నిలిచే గ్రంథాలయాల ద్వారా యువతకు, విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాండూరులోని నూతన గ్రంథాలయ భవనానికి రూ. 1కోటికి పైగా నిధులు మంజూరయ్యారని తెలిపారు. దౌల్తాబాద్లో రూ. 67 లక్షలతో పనులు ప్రారంభమయ్యాయని, కోడంగల్లో రూ. 50 లక్షలో భవనం పూర్తికావొస్తుందని, మర్పల్లి, దోమలో కూడ భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, వికారాబాద్ పట్టణంలోని సంస్థ ప్రధాన కార్యాలయం కూడ ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. వచ్చేనెలలో మంత్రి కేటీఆర్ పర్యటన ఖరారు అయితే భవనాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునీకరిస్తామని, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు కృసి చేస్తామన్నారు. దీంతో పాటు మనఊరు మన బడి ద్వారా రీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఇందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేల సహాకారంతో గ్రంథాలయాల ద్వారా విద్యార్థులకు సహాయ పడేవి ధంగా కృషి చేస్తామన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఏర్పాటుకు ముందు తెలంగాణ అభివృద్ధి చెందదని చేసిన ప్రచారాలను తిప్పికొట్టి దేశంలో అభివృద్ధి రాష్ట్రంగా నిలుపుతున్నారని అన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రోడ్లను అభివృద్ధి పరుస్తూ.. నిరుద్యోగ యువతకు తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో తాండూరు సర్వతోముఖోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అందరి సహయ సహకారాలు అందించాలన్నారు.

