ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం..!
– ఆచూకీ కనిపెట్టాలని తల్లిదండ్రుల వేడుకోలు
– పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. కుమారుడి ఆచూకీని కనిపెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కుటుంభీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలో గాంధీ నగర్ కి చెందిన మహమ్మద్‌ ఖైసెర్(17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్‌ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 16న ఇంటి నుంచి వెళ్లిన ఖైసర్ అదృశ్యమైయ్యాడు. తల్లిదండ్రులు షాజహాన్, తండ్రి మౌలానా తెలిసిన వారి వద్ద, బందువుల వద్ద విచారించినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సోమవారం కుటుంభీకులు మాట్లాడుతూ ఖైసర్ ఇంటర్‌ మొదటి సంవత్సరంలో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని, అయినా రెండో సంవత్సరంలో చదువుతున్నాడని తెలిపారు. కాలేజీలో స్నేహితుల మధ్య గొడవలు జరగడంతో పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తమ కుమారుడి ఆచూకీని కనిపెట్టాలని కోరుతున్నారు. ఖైసర్ ఆచూకీ తెలిస్తే తాండూరు పోలీసులను లేదా సెల్ నెంబర్ 7032500293కు సంప్రదించాలని కోరారు.

ఇదికూడ చదవండి…

శ్రీసాయి మెధాలో బోనాల పండగ