వినాయకుని కృప సిద్ధించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

వినాయకుని కృప సిద్ధించాలి
– జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ రాజుగౌడ్
– గణనాథుల దర్శనం, పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయకుని కృప అందరికి సిద్ధించాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ఆకాంక్షించారు. శనివారం నాలుగో రోజు పట్టణంలోని శాంతిన‌గ‌ర్‌, య‌శోధ‌న‌గ‌ర్‌తో పాటు వివిధ ప్రాంతాలలో ప్రతిష్టించిన వినాయకులను రాజుగౌడ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మండల సమితి సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలలో పాల్పంచుకుని భక్తులకు అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ అన్ని విఘ్నాలు తొలగించాలని వినాయకున్ని పూజిస్తామన్నారు. వినాయకుని కృపతో అందరి విఘ్నాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. మ‌రోవైపు వినాయ‌క ఉత్స‌వ స‌భ్యులు చైర్మ‌న్ రాజుగౌడ్‌ను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమాలలో మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కుమార్చ‌ మధుసూధన్ గౌడ్, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.