తల్లిపాలే అమృతం
– కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తల్లి పాలే బిడ్డలకు అమృతంలా పనిచేస్తాయని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్ లో ఉన్న అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ హాజరై మాట్లాడుతూ గర్భిణీ, బాలింతలకు, తల్లులకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. పుట్టిన శిశువులకు పాలు పట్టించడం వల్ల అమృతంలా పనిచేస్తాయన్నారు. తల్లి పాలలో శిశువుల్లో రోగనిరోధక శక్తి పెంచే శక్తి ఉంటుందని అన్నారు. పిల్లలు ఎలాంటి అనారొ గ్యాలకు గురికాకుండా ఉంటారని అన్నారు. అదేవిధంగా అంగన్ వాడి కేంద్రంలో చిన్నారులకు అందించే పౌష్టికాహారాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. రాజేశ్వరి, అంగన్ వాడి టీచర్ రాధ, ఆయమ్మ అనిత, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

