కర్ణాటకలో కొనసాగుతున్న పాదయాత్ర

తాండూరు రాజకీయం వికారాబాద్

కర్ణాటకలో కొనసాగుతున్న పాదయాత్ర
– 18వ రోజు సవ్యంగా పూర్తి చేసిన స్వాములు
–  500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: కఠోరమైన అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప స్వాములు అంతే అత్యంత నియమనిష్టలతో శబరీ గిరీశుని దర్శించుకునేందుకు పాదయాత్రగా బయల్దేరిన తాండూరు స్వాముల యాత్ర కొనసాగుతోంది. గురువారం 18వ రోజు స్వాముల పాదయాత్ర కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లపూర్‌కు చేరుకుంది. ఈ నెల 7వ తేదిన తాండూరు నుంచి గురు స్వాములు గోపాల్, నర్సింలు గౌడ్, బషీరాబాద్ నుంచి గురుస్వామి సాయిలు గౌడ్, కరణ్ కోట్ నుంచి గురుస్వామి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో 32 మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రగా శబరి బయల్దేరిన విషయం తెలిసిందే. సువర్ణభూమి ఆధ్వర్యంలో చేపట్టిన స్వాములు పాదయాత్రలో 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృపతో పాదయాత్ర సవ్యంగా కొనసాగుతుందన్నారు. అందరు ఆరోగ్యంగా ఉన్నామని.. ఎవ్వరు ఆధైర్య చెందవద్దని కుటుంబ సభ్యులకు, ప్రజలకు భరోసా అందించారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకుంటున్నామని అన్నారు. ఈ పాదయాత్రలో సువర్ణభూమి అధినేత గురుస్వామి మేక శ్రీనివాస్‌, గురుస్వామి వినయ్, గురుస్వామి వసంత్, గురుస్వామి సాయిలు గౌడ్, గురుస్వామి గోపాల్, గురుస్వామి నర్సింలు, గురుస్వామి పట్లోళ్ల గంగాదర్, గురుస్వామి వరాల శ్రీనివాస్ రెడ్డి, స్వాములు చెంగోల్ రాము యదవ్, కండక్టర్ పోచయ్య, రమేష్ డాన్స్ మాస్టర్ తదితరులు ఉన్నారు.