స్వచ్ఛత నీటీతోనే ఆరోగ్యం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

స్వచ్ఛత నీటీతోనే ఆరోగ్యం..!
– మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
– గాంధీనగర్ లో స్వచ్ఛదనం, పచ్చదనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వచ్ఛత నీటితోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం రెండో రోజు పట్టణంలోని గాంధీనగర్లో కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా వార్డు పరిసర ప్రాంతాల్లోని తాగునీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అంతకుముందు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ సమక్షంలో ప్రజలు వినియోగిస్తున్న నీటిని క్లోరోస్కోప్ టెస్ట్ ద్వారా క్లోరిన్ శాతంను పరీక్షించారు. అదేవిధంగా కలుషిత నీటిలో థీమోపాస్ ను వేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛమైన నీటిని తాగడం, వినియోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.

తాగునీరు, ఇతర అవసరాల కోసం వాడుకునే నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటిని ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు పారబోసి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ రాములు, ఆర్పీ శోభ, విజయలక్ష్మీ, ఏఎన్ఎం శాంత, ఆశ వర్కర్ సుజాత, అంగన్ వాడి టీచర్ రాధ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

టైంకు బస్సు రాకుంటే ఎట్లా సార్..!