టైంకు బస్సు రాకుంటే ఎట్లా సార్..!
– ఆర్టీసీ డీపో ముందు విద్యార్థుల దర్నా
– డీఎంతో మాట్లాడిన బీసీ సంఘం నేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : టైంకు బస్సులు రాకుంటే ఎట్లా సార్ అంటూ విద్యార్థులు మండిపడ్డారు. మంగళవారం తాండూరు ఆర్టీసీ డీపోలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాలాల మండలం బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణ చారి ఆధ్వర్యంలో యాలాల మండలం రుద్రారం, నాగారం, జంటుపల్లి, పగిడిపల్లి, అక్కంపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 150 మంది విద్యార్థులు డీపో ముందు బైటాయించారు. ఆయా గ్రామాలకు ఒకే బస్సు నడిపిస్తున్నారని, అదికూడా సమయానికి రావడం లేదని మండిపడ్డారు. టైంకు బస్సులు రాకుంటే ఎలా చదువుకోవాలని, ఒకే బస్సు నడిపిస్తే ఏం లాభమని ఆవేధన వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం సమయానికి బస్సులను నడపాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్‌తో బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ చారి మాట్లాడారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇందుకు డీపో మేనేజర్ స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని చెప్పడంతో విద్యార్థులు శాంతించి ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో బీసం సంఘం కార్యదర్శి ప్రసాద్ గౌడ్, నరేష్, అశోక్, అభిలాష్, మహేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

