వీఆర్ఏలతో చెలగాలట మాడొద్దు
– పే-స్కేల్ జీఓను విడుదల చేయాలి
– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
– వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలి, నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలతో చెలగాటం ఆడుతోందని, వెంటనే పే-స్కేల్ జీఓను విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో తాండూరు మండల కార్యాలయం నుంచి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ వీఆర్ఏ జేఏసీ నాయకులు రాజ్ కుమార్, రాజేందర్ రెడ్డి, బాబు, సంధ్య, నరసమ్మలతో కలిసి మాట్లాడుతూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో 24 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వికారాబాద్ జిల్లాకు వచ్చిన కేసీఆర్ సభలో వీఆర్ఏల సమస్యలపై చర్చిస్తారని అనుకుంటే నిరాశే మిగిల్చారని అన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హమీ మేరకు పే-స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అర్హులైన వీఆర్ఏల అందరికీ ప్రమోషన్లు కల్పించాలని, 55సంవత్సరాల వయసు కలిగిన వీఆర్ఏల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరంకుశ ధోరణి గా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలాల వీఆర్ఏ జేఏసీ నాయకులు చంద్రప్ప, మునియప్ప, వెంకటయ్య, సమీర్, శ్రీశైలం, బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


