ఇంటి మీదికి దూసుకొచ్చిన కారు..!
– పార్కు చేసిన మూడు బైకుల ధ్వంసం
– సీసీ పుటేజీలో వీడియో రికార్డు
– పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అతివేగంతో ఓ కారు ఇంటి మీదికి దూసుకొచ్చింది. ఇంటి ముందు పార్కింగ్ చేసిన రెండు బైకులు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామున తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సాయిపూర్‌లో మోయిద్ పాష నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి తన ఇంటి ముందు పల్సర్ బైకు, ఫ్యాషన్ ప్లస్, హెచ్ఎఫ్ డిలెక్స్ బైకులను పార్కింగ్ చేసి ఉంచాడు. బుధవారం తెల్లవారు జామున ఏపీ29 బీడీ 7777 అనే నెంబర్ గల కారు అతివేగంగా ఇంటిమీదకు దూసుకవచ్చింది.
ఈ క్రమంలో ఇంటిముందు పార్కింగ్ చేసిన బైకులు ధ్వంసం అయ్యాయి. కారు భీభత్సం సృష్టించిన దృశ్యాలు స్థానికుల నివాసం ఇంటి సీసీ పుటేజీలో రికార్డు అయ్యాయి. కారులో మైనర్ బాలుడు ఉన్నట్లు అనుమానించారు. అతనే డ్రైవింగ్ చేస్తూ ప్రమాదం చేసినట్లు భావిస్తున్నారు. జరిగిన సంఘటనపై బాధితుడు మోయిద్ పాష తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.
ఇదికూడా చదవండి…

