స్థానిక ఎన్నికల శిక్షణలో గందరగోళం
– ఒక్కో టీచర్‌కు మూడు, నాలుగు అర్డర్లు
– అయోమయంకు గురవుతున్న ఉపాధ్యాయులు
– క్లారీటీ ఇవ్వాలని కోరుతున్న పీఆర్టీయూ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గందరగోళంగా మారింది. ఒక్కో ఉపాధ్యాయుడుకి మూడు నుంచి నాలుగు ఆర్డర్లు రావడంతో వారు అయోమయానికి గురవుతున్నారు.

ఎన్నికల నిర్వహణ కోసం ఉపాధ్యాయులు కీలకం కావడంతో వారికి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులకు శిక్షణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ ఒక్కో ఉపాధ్యాయుడికి మూడు నుంచి నాలుగు ఉత్తర్వులు రావడంతో అయోమయానికి గురవుతున్నారు. ఈ అంశంపై పీఆర్టీయూ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల శిక్షణ తరగతులపై ప్రభుత్వం క్లారీటీ ఇవ్వాలని పీఆర్టీయూ యాలాల మండల శాఖ అధ్యక్షులు కృష్ణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

ఒక్కో ఉపాధ్యాయుడుకి మూడు, నాలుగు అర్డర్లు రావడం, కొంత మందికి అసలు అర్డర్లే రాలేదని అన్నారు. మూడు, నాలుగు అర్డర్లు వచ్చిన ఉపాధ్యాయులు ఏ శిక్షణ కేంద్రానికి వెళ్లాలో అర్థం కావడం లేదన్నారు. అదేవిధంగా స్పౌజ్, మ్యూచువల్స్పై ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఉపాధ్యాయులకు కూడా అర్డర్లు రావడం అయోమయానికి గురిచేస్తుందని అన్నారు. ఎన్నికల శిక్షణపై ఇలా గందరగోళంకు గురిచేయడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి పూర్తి క్లారీటి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

