ఫుడ్ సెప్టీ అందరి బాధ్యత
– వ్యాపారులు ఫోస్టాక్ సర్టిఫికెట్లు పొందాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– కేవీజీవీఎం ఆధ్వర్యంలో యజమానులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆహారం, తినుబండరాల విషయంలో ఫుడ్ సెఫీని పాటించడం అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలు అన్నారు. బుధవారం తాండూరు పట్టణం విలియమూన్ స్కూట్లో కేవీజీవీఎం సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హోటల్, టిఫెన్ సెంటర్ల వ్యాపారులు, యజమానులకు ఫోస్టాక్(ఫుడ్ సెఫీట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్) పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలు మాట్లాడుతూ వ్యాపారులు, నిర్వహకులు హోటల్, టిఫెన్ సెంటర్లలో ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఆహారాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలన్నారు. దోమలు, ఈగలు వాలకుండా చూసుకోవాలన్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీటు దుకాణాల వ్యాపారులు ఫుడ్ సెప్లీనీ పాటించడం బాధ్యత అని అన్నారు. అదేవిధంగా ఫోస్టాక్ శిక్షణ, సర్టిఫికెట్లు పొందిన వారికి ప్రభుత్వం నుంచి మున్సిపల్ నుంచి లైసెన్సులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సెఫ్టీ ఇంచార్జ్ సునీత, కేవీజీవీఎం, ఫోస్టాక్ సౌత్ ఇండియా ఇంచార్జ్. అధికారులు సింధు, మోహన్ బాబు, శిక్షకులు యశోధ దేవి, సంజయ్, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

