తాండూరులో టాస్క్ ఫోర్స్ దాడులు
– 23 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
– పురుగుల మందుల విక్రయేతలపై దాడి
– పోలీసులకు అప్పగింత, కేసులు నమోదు
తాండూరు, దర్శని ప్రతినిధి: తాండూరు పట్టణంలో వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. బుధవారం వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బృందం పట్టణంలోని మల్లప్ప మడిగ సమీపంలో ఉన్న ఓ బియ్యం దుకాణంలో తనిఖీలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ తనిఖీలో 46 బస్తాలలో 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. దీంతో షాపు యజమాని చాట్ల విశ్వనాథంతో పాటు బియ్యం బస్తాలను పట్టణ పోలీసులకు అప్పగించారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన మన్సూర్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ ముషేర్ వారి నివాసంలో ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా పురుగుల మందుల విక్రయాలకు పాల్పడుతున్నట్లు టాస్క్ పోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
ఇందులో భాగంగా పట్టణ పోలీసులతో కలిసి నిందితుల కారు(TS12EC5343)లో తనిఖీలు చేయగా అక్రమంగా ఉంచిన 8 రకాల (రూపాయలు 104,919/- విలువగల) పురుగుల మందులు లబించాయి. స్వాధీనం చేసుకొని పోలీస్టేషన్‌కు తరలించారు. మొదట రేషన్ బియ్యం నిల్వలపై సివిల్ సప్లయ్ డిప్యూటి తహసీల్దార్ సహదేవ్ ఫిర్యాదు మేరకు షాపు యజమాని విశ్వనాథంపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా తాండూరు వ్యవసాయ శాఖ అధికారి రజిత ఫిర్యాదు మేరకు పాత తాండూరు యువకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

