గాజీపూర్ నారాయణ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

గాజీపూర్ నారాయణ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పశు గణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ గాజీపూర్ నారాయణ రెడ్డిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. గత కొన్నిరోజులుగా నారాయణ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం నారాయణ రెడ్డి హైదరాబాద్ లోని ఆశ్విని సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని నారాయణ రెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.