వర్షానికి కూలిన ఇండ్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

వర్షానికి కూలిన ఇండ్లు
– తాండూరు మండలంలో ఘటన
– బాధితులకు ఆస్తినష్టం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో భారీ వర్షం భీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరాయి. వర్షానికి తడిసిన ఇండ్లు కూలీ పోయాయి. అంతారం తాండాలో బుజ్జి బాయికి చెందిన ఇళ్లు వెనుక భాగంలో కూలిపోయింది. అదేవిధంగా బిజ్జారం గ్రామంలో బజారమ్మ అనే మహిళకు చెందిన ఇళ్లు కూలిపోయింది. ఆయా ఘటనల్లో ఇళ్లు కూలిన ప్రదేశాల్లో ఎవ్వరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. కాని ఆయా ఇంటి యజమానులకు ఆస్తినష్టం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లలో ఉండరాదని సూచించారు.

ఇదికూడా చదవండి…

వాగుల వద్ద బందోబస్తు