ష్యూరిటీ లేకుండానే రూ. 20 లక్షల లోన్..!
– ముద్ర లోన్‌లో మార్పులు
– ఎవరు అర్హులు అంటే..?
దర్శిని డెస్క్ : చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. అందులో ముద్రలోన్ కూడా ఒకటి. ఇప్పుడు ఈ పథకంలో అర్హులైన వ్యాపారులు రూ. 20లక్షల వరకు రుణం పొందవచ్చు. అదికూడా ఎలాంటి షూరిటీ లేకుండా. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చిన్న వ్యాపారుల కోసం కూడా కీలక ప్రకటన చేసింది. ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఇచ్చే ముద్ర లోన్ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2015, ఏప్రిల్ 8న ఈ స్కీంను లాంఛ్ చేసిన కేంద్రం.. దీని కింద సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాల కోసం లోన్లు అందిస్తోంది.
దీని కింద 3 కేటగిరీల్లో లోన్లు పొందొచ్చు. భారతీయ పౌరులు అంతా ఈ బెనిఫిట్ పొందేందుకు అర్హులే. చిన్న చిన్న తయారీ యూనిట్లు, షాపులు నిర్వహించేవారు, పండ్లు, కూరగాయలు అమ్మేవారు, రిపేయిర్ షాప్స్, చేతివృత్తుల వారు ఇలా చిన్న వ్యాపారులు ఎవరైనా లోన్ పొందొచ్చు.
ఈ స్కీంలో మొత్తం 3 రకాల లోన్లు ఉంటాయి. శిశు రుణాల కింద రూ. 50 వేలు లోన్ వస్తుంది. కిశోర్ లోన్ ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ ఉంటుంది. తరుణ్ కేటగిరీ కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు లోన్ గతంలో ఉండగా.. ఇప్పుడు ఇదే రూ. 20 లక్షలకు చేరింది. ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణం పొందాలంటే రూ. 10లక్షల రుణం పొంది సకాలంలో రుణాలు చెల్లించడంతో పాటు ఎలాంటి అభ్యంతరాలు లేని వారు మాత్రమే రూ. 20లక్షల రుణం పొందేందుకు అర్హులని కేంద్రం స్పష్టం చేసింది.
ఇదికూడా చదవండి…

