వరధ ముప్పుకు యాక్షన్ ప్లాన్..!
– కబ్జాల కూల్చివేతకు ప్రత్యేక వ్యవస్థ
– సమస్యలకు శాశ్విత పరిష్కారానికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పట్టణంలో ముంపు ప్రాంతాల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు వరధ ముప్పు రాకుండా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని. అన్ని పనులను యుద్ధ ప్రాతిపాధికన పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాండూరు పట్టణంలో పలు ప్రాంతాలు వరధ ముంపుకు గురైన సంగతి తెలిసిందే. సోమవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లతో కలిసి హైదరాబాద్ రోడ్డు మార్గం, ఆదర్శనగర్, తులసీ నగర్, చిలుకవాగు పరిసర ప్రాంతాలతో పర్యటించారు.
వరధ ఉధృతి అడ్డంకికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణానికి వరధ ముప్పు పరిస్థితి ఇప్పటిది కాదని, ఏండ్లుగా తిప్పవేసి ఉందన్నారు. ఈ వరధ కష్టాలను ప్రజల నుంచి దూరం చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా చిలుకవాగు అభివృద్ధి కోసం రూ.16 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు. అదేవిధంగా గొల్ల చెరువులో కూడా రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. పాత తాండూరులో కూడా డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.
దీంతో పాటు పట్టణంలోని ముంపు ప్రాంతాల నుంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. మరోవైపు పట్టణంలోని చిలుకవాగుతో పాటు నాలాలు. కాలువలపై కబ్జాలను తొలగించేందుకు మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులో కలిపి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ వ్యవస్థతో కబ్జాలను ప్రక్షాళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, నాయకులు బంటు మల్లప్ప, హాది, బంటు వేణుగోపాల్, లొంక నర్సింలు, తాండ్ర రాకేష్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

