విజయమ్మ జన్మదినం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

విజయమ్మ జన్మదినం..!
– శుభాకాంక్షలు తెలిపిన బీఎస్ఆర్‌
– సన్మానించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన విశ్రాంత అధ్యాపకురాలు, మున్సిపల్ కౌన్సిలర్ విజయాదేవి జన్మదినం ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి విజయాదేవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విజయాదేవి, రంగారావులను సతీసమేతంగా సన్మానించారు. అనంతరం విజయాదేవి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. అదేవిధంగా పలువురు నాయకులు విజయాదేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మచ్చలేని నాయకురాలు విజయాదేవి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పటేల్ కిరణ్‌ కుమార్, బంటు వేణుగోపాల్, వికాస్ జోషి, బాతుల నాగేష్‌ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ముత్తడి దూకిన జుంటుప‌ల్లి వాగు