రోగాలపై ఔషధ బ్రహ్మస్త్రం…!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

రోగాలపై ఔషధ బ్రహ్మస్త్రం…!
– అతిబల మొక్కతో అనారోగ్యాలకు చెక్
– కుక్కకాటు విషానికి విరుగుడు మందు
– నీరసం నుంచి శరీరానికి యాక్టీవ్
దర్శిని డెస్క్ : అనారోగ్యం నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి ప్రయోగాలు చేస్తారో అందరికి తెలుసు. కొందరు ఇంగ్లీసు మందులు వాడితే.. ఇంకోందరు ఆయుర్వేధం వైపు మొగ్గుచూపుతారు. ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలు ఆరోగ్యానికి దివౌషధంలా పనిచేస్తాయని, ఇందులో అతిబల మొక్క బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయని అంటున్నారు. అతిబల చెట్టుని ముదురు బెండ చెట్టు అని కూడా అంటారు. ఇది పల్లెల్లో విరివిగా దొరుకుతుంది. దీని పూలు పసుపు పచ్చగా ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో వాడుతుంటారు.

చూసేందుకు పిచ్చిమొక్కగా అనిపిస్తుంది. దీనిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో వాడుతుంటారు. కానీ, చూసేందుకు పిచ్చిమొక్కగా అనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, అతిబల మొక్క, దాని పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జలుబు, దగ్గు ప్రభావాలను తొలగించడంలో సహాయపడతాయి. దీని ఆకుల రసాన్ని వారానికి రెండు, మూడు సార్లు సేవించడం వల్ల నీరసం, నిస్సత్తువ తగ్గి శరీరం ఆక్టివ్ స్టేజ్ లోకి వెళ్తుంది. అదేవిధంగా కంటి సమస్యలను తగ్గించడంలో అతిబల బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముదురు బెండ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో మూసిన కళ్ళను కడుగుతూ ఉంటే కంటికి గల దోషాలు తొలగిపోతాయని.

సాధారణంగా వయసుతో పాటు కీళ్ల నొప్పులు, నడుము నొప్పి మోకాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ అతిబల మొక్క యొక్క కాండాన్ని తీసుకొని, ఒక బండపై మంచినీరు వేసి, బాగా సాదాలి. దీని నుండి వచ్చిన మిశ్రమాన్ని ఎక్కడ నొప్పులు అయితే ఉంటాయో, వాటిపై లేపనంగా వేయాలి.ఇలా వారం రోజులు పాటు చేస్తే ఎలాంటి నొప్పులనైనా, వాపులనైనా తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు ఈ నాలుగు ముదురు బెండ ఆకులను తీసుకుని, ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఇందులో కండ చక్కెర లేదా పటిక బెల్లం కలిపి, రోజుకు మూడుసార్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. అంతే కాక ఇలా చేయడం వల్ల మూత్రణాల ఇన్ఫెక్షన్లు, అధిక జ్వరం వల్ల మూత్రానికి వెళ్ళినప్పుడు వచ్చే మంటను తగ్గిస్తుంది.

సాధారణంగా పిచ్చికుక్కలు కరిచినప్పుడు వైద్యుల సహాయం తీసుకోవాలి. కానీ ఆ సమయంలో వైద్య సహాయం తొందరగా అందించ లేనప్పుడు ఈ అతిబల ఆకులను తీసుకొని బాగా నలిపి రసం తీయాలి. దానిని పిచ్చి కుక్క కరిచిన వ్యక్తికి తాగించి, గాయమైన చోట ఆకులను కట్టుగా కట్టాలి. ఇలా చేయడం వల్ల పిచ్చికుక్క వల్ల కలిగే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఆ తర్వాత నిదానంగా వైద్యున్ని సంప్రదించవచ్చు.

పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను తొల‌గించేందుకు అతిబ‌ల ఎంత‌గానో ప‌నిచేస్తుంది. దీని పొడిని వాడ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. శీఘ్ర స్క‌ల‌న స‌మ‌స్య త‌గ్గుతుంది. వీర్యం ఎక్కువ‌గా త‌యార‌వ‌డ‌మే కాక నాణ్యంగా కూడా ఉంటుంది. సూపర్ స్ట్రాంగ్ జ్యూస్, పౌడర్ రూపంలో మార్కెట్లో సులభంగా దొరుకుతాయి.

ఇదికూడా చదవండి..

దళిత యువకుడిపై దాడిలో ఘటనలో ట్విస్ట్..!