స్వచ్ఛతే.. రక్షణ..!
– పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– మున్సిపల్ లో ప్రారంభమైన స్వచ్చత హీ సేవా ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వచ్ఛతంగా ఉంటేనే ప్రజలకు, పర్యావరణానికి రక్షణ లభిస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఆధ్వర్యంలో అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవలో అందరు భాగస్వాములు కావాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయా దేవి, ప్రభాకర్ గౌడ్, మమత, సోమశేఖర్, మేనేజర్ నరేందర్ రెడ్డి, అధికారులు ఉమేష్, వెంకట్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

