సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసు బందోస్తు
– పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ నిఘా
– సమన్వయంతో విధులు నిర్వర్తించాలి
– తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఉంచడం జరుగుతుందని తాండూరు ఆర్డీఓ, నియోజకవర్గ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు అన్నారు. గురువారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల సెక్టోరల్ అధికారులు, తహసీల్దార్లకు ఎన్నికల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఇప్పటికే నియమించబడిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఎన్నికల విధుల్లో ఏమాత్రం పొరపాట్లు చేయొద్దన్నారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలన్నారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలు తప్పక ఉండేలా చూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, ప్రహారీ గోడలు ఉండాలన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలలో పోలీసు బందోస్తు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసే విధంగా అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, డీఏఓ మహేష్ గౌడ్, తహసీల్దార్లు తారాసింగ్. కిషన్, వెంకటస్వామి, మునీరుద్దీన్, డీప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆర్ లు రాజారెడ్డి, బాల్ రాజ్, సీనీయర్ అసిస్టెంట్ మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

