హెల్త్ రేట్.. పెంచే క్యారెట్..!
– రక్తహీనత తగ్గించి.. ఇమ్యూనిటీ పెంచే పవర్స్
– గుండెపోటుకు తగ్గించడంతో సాయం
దర్శిని ప్రతినిధి : మార్కెట్లో దొరికే క్యారెట్ వల్ల హెల్త్ రేట్ పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజు ఓ క్యారెట్ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడంతో పాటు కంటి, ఎముకలు, గుండెపోటు సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

క్యారెట్లలో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సూర్యకాంతి నుంచి కాపాడుతాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. చర్మంలో సహజసిద్ధమైన కాంతి పెరుగుతుంది. చర్మం టోన్ మెరుగు పడుతుంది.
ఎముకలు దృఢమవుతాయి. బరువు తగ్గడానికి, లివర్ పనితీరు మెరుగుదలకు సహాయపడుతుంది. క్యారెట్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. క్యారెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. క్యారెట్‌లోని బీటా కెరోటిన్ ‘విటమిన్ A’గా మారి కంటి చూపునకు మేలు చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. రక్తహీనతను తగ్గించడంతో పాటు విటమిన్-B6, విటమిన్-C రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి కాపాడుతుంది.
క్యారెట్‌లో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.క్యారెట్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ తినడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. కంటి చూపు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. లివర్, లంగ్స్, కోలన్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. విటమిన్ ఎ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
క్యారెట్లలో లుటీన్, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. అందువల్ల మెదడు పనితీరును ఇవి మెరుగు పరుస్తాయి. దీంతో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. క్యారెట్‌ను రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని అధ్యయనంలో వెల్లడైంది. క్యారెట్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి….

