వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించరాదు
– రోగులకు మెరుగైన సేవలను అందించడమే ముఖ్యం
– జిల్లా ఆసుపత్రిని సందర్శించిన సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
– నర్సింగ్ కాలేజీను కూడా పరిశలించిన సబ్ కలెక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్ తో కలిసి ఆసుపత్రిలోని క్యాసువాలిటీ, రోగుల వార్డులు, మరుగుదొడ్లు, మందుల గదులు తదితర విభాగాలను పరిశలించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న సమస్యలు, ఖాళీలు, స్థంభించిన సేవల గురించి సమీక్షించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. రోగులకు అందించే వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలా దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ విభాగంలో కొనసాగుతున్న తాండూరు నర్సింగ్ కాలేజీని కూడ సబ్ కలెక్టర్ సందరి ్శంచారు. కళాశాల నిర్వహకులతో కలిసి విద్యార్థులకు నిర్వహిస్తున్న తరగతులు, సమస్యల, వసతులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తాండూరు తహసీల్దార్ తారాసింగ్, ఆసుపత్రి ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్ రెడ్డి. సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారి మాణిక్ రావు, వైద్య అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి..

