తాండూరు మున్సిపల్ కమిషనర్ గా షఫీవుల్లా

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు మున్సిపల్ కమిషనర్ గా షఫీవుల్లా
– తాండూర్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
– ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ నూతన కమిషనర్ గా షఫీవుల్లా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చార్జ్ తీసుకున్నారు. గతంలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన శంకర్ సింగ్ పై అవినీతి ఆరోపణలు, ప్రజా సమస్యలపై అశ్రద్ధ, ప్రజా ప్రతినిధులకు ఎదురు తిరగడం వంటి ఆరోపణలు నేపథ్యంలోఆయనపై బదిలీ పెట్టి వేసింది. దీంతో ఆయన స్థానంలో మెప్మా పీడీగా పనిచేస్తున్న షాఫీవుల్లాను తాండూరు మున్సిపల్ కమిషనర్ గా నియమించింది. ఈ మేరకు ఆయన తాండూరు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలో పారిశుద్ధ్యం, ప్రజా సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మున్సిపల్ నూతన కమిషనర్ గా వచ్చిన కమీషనర్ షఫీవుల్లాకు మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాధ్, ఏఈ ఖాజా, ఉద్యోగులు స్వాగతం పలికారు.

 

ఇది కూడా చదవండి….

తాత తడబడలేదు..!

chaithany collage