మహేంద్రుడికి జేజేలూ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మహేంద్రుడికి జేజేలూ..!
– నేతల నుంచి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
– స్వయంగా వెళ్లి సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– తాండూరు నుంచి భారీగా తరలివెళ్లిన ప్రతినిధులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్‌ లోని మాజీ మంత్రి మహేందర్రెడ్డి నివాసం జేజేల ద్వానాలతో మార్మోగింది. సోమవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోమవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి నివాసంలో మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సునితారెడ్డి, కుమారుడు రినీష్ రెడ్డి, కుటుంబ సభ్యుల సమక్షంలో మహేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు.

అనంతరం తాండూరు నియోజకవర్గంకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నివాసానికి వెళ్లి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మహేందర్ రెడ్డిని సన్మానించి కేక్ తినిపించారు.

అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ రవిందర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వడ్డె శ్రీనివాస్, అబ్దుల్ రావుఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు పరిమళ రవీందర్, జుబేర్ లాల, నాయకులు గడ్డలి రవీందర్, తాటికొండ పరిమళ్ గుప్త, బంటు మల్లప్ప, మసూద్, సోమనాథ్ గౌడ్, యాలాల మండల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, గాజీపూర్ నారాయణ రెడ్డి, మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ సీనీయర్ నాయకులు ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్సీ మహందర్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి….

పట్నం కోసం కదిలొచ్చిన ప్రాణదాతలు..!