అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
– బతుకమ్మను ఎత్తుకున్న చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం యాలాల సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ హాజరయ్యారు. జెడ్పీటీసీ సంధ్యారాణి, సర్పంచ్ సిద్రాల సులోచనలతో కలిసి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ బతుకమ్మను ఎత్తుకున్నారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. మహిళలు బతుకమ్మ పాటలకు లయబద్దంగా అడుగులు వేస్తూ సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, జెడ్పీటీసీ సంధ్యారాణిలు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ అందరిని చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
