ఆగ్రహించిన ఆర్యవైశ్యులు..!
– పొట్టి శ్రీరాములు పేరు మార్చొద్దంటూ నిరసన
– వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని ఆర్యవైశ్యులు ఆగ్రహరించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంకు ఉన్న పొట్టి శ్రీరాములు పేరును మర్చాలని తీసుకున్న నిర్ణయంపై సోమవారం వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో తాండూరు నుంచి ఆర్యవైశ్యులు భారీగా తరలివెళ్లారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చే పొట్టిశ్రీరాములు పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. తెలంగాణ సమాజం కోసం ఎంతోమంది ఎనలేని సేవలు చేశారువారి సేవలను గుర్తించడం కోసం ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు తీసుకుని వచ్చి వాటికి వాళ్ల పేర్లు పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును మార్చినట్లయితే ఆర్యవైశ్యుల కోపాగ్నికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

