లడ్డూ కల్తీ దుర్మార్గం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

లడ్డూ కల్తీ దుర్మార్గం..!
– తాండూరులో హిందువుల ఆగ్రహం
– మనోభావాలు దెబ్బతీశారంటూ మండిపాటు
– పురవీధుల్లో నిరసన ర్యాలీ, మానవహారం
– నిందితులను శిక్షించాలని పోలీసులకు వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తిరుమల లడ్డూ వివాదంపై వికారాబాద్ జిల్లా తాండూరులోని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీకి పాల్పడి హిందూవుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వదలొద్దంటూ కదం తొక్కారు. పాపం చేసిన వారిని శిక్షించాలంటూ పోలీసులకు వినతిపత్రం అందజేశారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, తెలంగాణ సాధూ పరిషత్, గీత సత్సంగ్ సేవా సమితిల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమయ్యింది.

గాంధీ చౌక్, మర్రిచెట్టు కూడలి, నెహ్రు గంజ్, ఇందిరా చౌరస్తా వరకు కొనసాగింది. ఇందిరా చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. అనంతరం పట్టణ పోలీస్టేషన్ కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంతో పుణ్యక్షేత్రమైన తిరుమలలో స్వామి వారి లడ్డూ ప్రసాదంను కల్తీకీ పాల్పడడంపై మండిపడ్డారు. కల్తీ నూనెలు కలిసి అపవిత్రం చేశారని, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదంను కల్తీ చేసిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి సంఘటనలు జరగకుండా హిందూవులు ఐక్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సమితి, సంఘాల ప్రతినిధులు పట్లోళ్ల నర్సింలు, విజయలక్ష్మీ, రజనీకాంత్, చల్లా నారాయణ, దేవగారి రమేష్, బీజేపీ నాయకులు కృష్ణ ముదిరాజ్. నాగారం మల్లేశం, అంతారం కిరణ్. బంటారం భద్రేశ్వర్, అల్లంపల్లి శ్రీనివాస్, జుంటుపల్లి వెంకట్, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఆగ్రహించిన ఆర్యవైశ్యులు..!