స్వచ్ఛత అందరి బాధ్యత

తాండూరు రాజకీయం వికారాబాద్

స్వచ్ఛత అందరి బాధ్యత
– మున్సిపల్ కౌన్సిలర్ విజయాదేవి
– కాలేజీ విద్యార్థులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వచ్ఛత అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ విజయాదేవి రంగారావు అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సింధూ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ విజయాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. తమతో పాటు తమ పరిసరాలను స్వచ్ఛతగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది. జవాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

లడ్డూ కల్తీ దుర్మార్గం..!