ఆపూర్వ స‌మ్మేళ‌నం..!

తాండూరు వికారాబాద్

పూర్వ స‌మ్మేళ‌నం..!
– సంతోషంగా గ‌డిపిన పూర్వ విద్యార్థులు
– సంద‌డి చేసిన పీపుల్స్ డిగ్రీ క‌ళాశాల 93 బ్యాచ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిది: ఆనాటి జ్ఞాప‌కాలు.. స్మృతులు ఎంతో మధురంటూ తాండూరు పీపుల్స్ డిగ్రీ క‌ళాశాల పూర్వ విద్యార్థులు అభిప్రాయ‌ల‌ను పంచుకున్నారు. ఆదివారం క‌ళాశాల‌కు చెందిన 1991-93 బ్యాచ్ విద్యార్థులు దాదాపు 28 ఏండ్ల త‌రువాత పూర్వ విద్యార్థులు ఆత్మీయ స‌మ్మేళ‌నం జ‌రుపుకున్నారు. ప‌ట్ట‌ణంలోని హిమాల‌య హోట‌ల్‌లో పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నాన్ని సంతోషంగా జ‌రుపుకున్నారు. అప్ప‌టి అధ్యాపకులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చ‌దువుకున్న స‌మ‌యంలో జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుని మ‌ధుర స్మృతుల‌ను గుర్తుచేసుకున్నారు. పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ జ‌ర్న‌లిస్టు సంఘం వికారాబాద్ జిల్లా అధ్య‌క్షులు శ్రీ‌నివాస్ చారి, ఎల్బీ న‌గ‌ర్ విజిలెన్స్ ఇనుస్పెక్ట‌ర్ నాగ‌భూషణం, మాజీ జెడ్పీటీసీ సునీత‌, తాండూరు చైతన్య జూనియ‌ర్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ సోమ‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.