రేపు కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్య‌ర్థుల‌కు మాడ‌ల్ టెస్ట్

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

– ప్ర‌గ‌తి కోచింగ్ సెంట‌ర్‌లో నిర్వ‌హ‌ణ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ద‌మ‌వుతున్న అభ్య‌ర్థులకు రేపు ఉచిత మాడ‌ల్ టెస్ట్ నిర్వ‌హిస్తున్న‌ట్లు తాండూరు ప్ర‌గ‌తి కోచింగ్ సెంట‌ర్ డైరెక్ట‌ర్లు శ్రీ‌శైలం, సంగ‌మేశ్వ‌ర్లు తెలిపారు. ప‌ట్ట‌ణంలోని పాత విజ్ఞాన్, ప్ర‌స్తుత శ్రీ‌క‌ర జూనియ‌ర్ క‌ళాశాల వ‌ద్ద ఉన్న ప్ర‌గ‌తి కోచింగ్ సెంట‌ర్‌లో
బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప‌రీక్ష ఉంటుంద‌న్నారు. ఉచిత రిజిస్ట్రేష‌న్ చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ప‌రీక్ష రిజిస్ట్రేష‌న్ కోసం సెల్: 9949272357, 8555869112 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.