మ‌హిళ సంక్షేమానికి పెద్ద పీట

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

మ‌హిళ సంక్షేమానికి పెద్ద పీట
– బ‌తుక‌మ్మ సారెతో ఆడ‌ప‌డుచుల్లో సంతోషం
– చీర‌ల పంపిణీలో ఎమ్మెల్సీ మ‌హేంద‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రం మ‌హిళ సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు పేర్కొన్నారు. శ‌నివారం తాండూరు ప‌ట్ట‌ణంలోని రాజీవ్ కాల‌నీ, తాండూరు మండ‌లంలోని క‌ర‌ణ్ కోట్ గ్రామంలో ఏర్పాటు చేసిన బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొని మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ‌లు, ఆడప‌డుచుల సంతోషం కోసం ప్ర‌తి యేడాది బతుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తోంద‌న్నారు. పుట్టింటి సారెల తెలంగా ప్ర‌భుత్వం ఆడ‌ప‌డుచుల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌తో చిరుకానుక‌ను అంద‌జేస్తుంద‌ని తెలిపారు. అదేవిధంగా క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీముభార‌క్, ఒంట‌రి మ‌హిళ వంటి ప‌థ‌కాల‌తో సీఎం కేసీఆర్ మ‌హిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నార‌ని పేర్కొన్నారు. బతుక‌మ్మ కానుక‌ను అందుకున్న మ‌హిళ‌లు పండ‌గ‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ గౌడ్, తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ గౌడ్, క‌ర‌ణ్ కోట్ స‌ర్పంచ్ వీణ హేమంత్‌కుమార్, ఎంపీటీసీ వ‌సంత్‌కుమార్, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), సీనీయ‌ర్ నాయ‌కులు డాక్ట‌ర్ సంప‌త్ కుమార్,ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి, కౌన్సిల‌ర్లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.