చెప్పినవన్నీ చేసితీరుతాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చెప్పినవన్నీ చేసితీరుతాం..!
– అక్రమ వసూళ్లు.. దందాల ఆపేక్ష లేదు
– గత పదేళ్లు ఎంజాయ్ తప్పా చేసిందేమీ లేదు
– రెండేళ్లలో అభివృద్ధి పనులు పూర్తి
– తాండూరు ముఖచిత్రం మారడం ఖాయం
– త్వరలోనే నామినేటేడ్ పదవుల భర్తీ
– పెండింగ్ ప్రాజెక్టుల పురోగతికి ప్రత్యేక దృష్టి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : నమ్మి గెలిపించిన ప్రజలకు చెప్పివన్నీ చేసి తీర్చి.. తాండూరును రోల్ మాడల్ గా మార్చి తీరుతామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏండ్ల రాజకీయాలలో జెడ్పీటీసీ, డీసీసీబీ చైర్మన్ గా, ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసినా ఎక్కడా అక్రమ వ్యాపారాలు, వసూళ్లు చేయడం జరగలేదని, చేసేది కూడా లేదని తేల్చి చెప్పారు. గతంలో తెలంగాణను ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్నారు. తాండూరులో పదేళ్లు పాలించిన పాలకులు బైపాస్ రోడ్డు, కోట్ పల్లి, శివసాగర్, జుంటుపల్లి ప్రాజెక్టులను అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని అన్నారు.

చిలుక వాగు, గొల్ల చెరువుల అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. శిలాఫలాకాలు వేయడం తప్పా అభివృద్ధిని చేయలేదన్నారు. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి, మైల్వార్ పరిధిలో కర్ణాటక తెలంగాణ రాష్ట్రా ల సరిహద్దు సమస్యలను కూడా పట్టించుకోలేదన్నారు. తాండూరు -వికారాబాద్ రోడ్డుతో పాటు నియోజకవర్గంలో రోడ్ల దుస్తితిపై వహించిన నిర్లక్ష్యం గురించి చెప్పాల్సిన పనిలేదన్నారు. అక్రమ ఇసుక, మైనింగ్ రవాణా వ్యవహరాలు బోనస్ అని విమర్శించారు. ఈ పదేళ్లు పదవులు పొంది హైదరాబాద్ లో ఎంజాయ్ చేశారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక పెండింగ్ పనుల పురోగతికి కృషి చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిధులను మంజూరు చేయించుకుని అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

తాండూరు మండలం జినుగుర్తిలో ఇండస్ట్రీయల్ పార్కు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పాత తాండూరులో ఆ౦బీ పనులు, ఈఎస్ఐ ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. బషీరాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకవచ్చి.. వైద్యులను నియమించడం జరిగిందన్నారు. దౌలాపూర్ లో కృషి విజ్ఞాన కేంద్రం, తాండూరులో ఏటీసీ- ఐటీఐ కాలేజీ పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇవన్నీ పదేళ్ల కిందటే తీసుకవస్తే ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కిన సందర్భంగా వచ్చే రెండేళ్లలో తాండూరులో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసి తీరుతామన్నారు.

తాండూరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతామన్నారు. అంతేకాని అక్రమ సంపాదన, వసూళ్లు, కార్యకలాపాలను కొనసాగించే ప్రసక్తే లేదన్నారు. పదేళ్లలో తమ హయాంలో జరిగిన అక్రమ కార్యకలాపాలను వదిలేసి.. కాంగ్రెస్ హయాంలో, జరగకపోవడంతో విజ్ఞత మరిచి ఏ మర్శలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు తాండూరులో దేవాలయాల నామినేటేట్ పదవులను త్వరలోనే భర్తి చేయడం జరుగుతుందన్నారు. రాబోయే పంచాయతీ. జెడ్పిటిసి ఎన్నికల్లో ఇప్పటి నుంచే పదవులు పంపకాలు చేశారని వస్తున్న పుకార్లలో నిజం లేదన్నారు. పనిచేసే నాయకులకే పదువులు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి…

తాండూరు ఎలా ఉంది..!